Thursday, January 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలి: కమిషనర్

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడానికి సహకరించాలి: కమిషనర్

కర్నూలు : ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహనప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి సవరించే ప్రత్యేక ప్రక్రియగా ఆర్వో వివరించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చేయడం, మరణించిన వారు, డూప్లికేట్ పేర్లు తొలగించడం, చిరునామా మారిన ఓటర్ల వివరాలు సరిచేయడం,

కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ విధంగా రూపొందే ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆర్వో పేర్కొన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ప్రజల్లో ఏర్పడే సందేహాలు, అపోహలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహా సూచనలతో నివృత్తి చేసి,

ఎన్నికల సంఘం అందించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లేలా సమన్వయంతో ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం అందరి బాధ్యతగా పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు  ఓటిపిలు అడగరని, గుర్తింపు కార్డుతోనే ఇంటింటికీ వచ్చి ధృవీకరణ చేపడతారని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ప్రచారాన్ని

మరింత ఉధృతం చేస్తామని, బీఎల్‌వోలు ప్రజల వద్దకు వచ్చినప్పుడు సహకరించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని ఆర్వో కోరారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ కే.వి.సతీష్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, ఎస్‌ఈ రమణ మూర్తి, ఎలక్షన్స్ సూపరింటెండెంట్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments