ఈరోజు మధ్యాహ్నం తెలుగు సినీనటుడు శ్రీ సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ ) శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.
ధర్మకర్తలమండలి సభ్యులు శ్రీ అవ్వారు శ్రీనివాసరావు, శ్రీమతి పద్మావతి ఠాకూర్ స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనంనకు తీసుకువెళ్లారు.
దర్శనం అనంతరం వేద పండితులు ఆశీస్సులు అందజేశారు. ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.




