మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రికార్డు ధరకు అమ్ముడైంది.
జనవరి 12న విడుదల కానున్న ఈ చిత్రం టికెట్‌ను ఓ అభిమాని రూ.1.11 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ ఘటనతో చిరు అభిమానుల్లో జోరు మరింత పెరిగింది. సంక్రాంతికి రచ్చే అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.




