Home South Zone Andhra Pradesh తెలుగు యువతి హత్య కేసు |

తెలుగు యువతి హత్య కేసు |

0

అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఇండియాకు పారిపోయిన పాత స్నేహితుడు!
అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, కొలంబియా ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు యువతి నికిత గోడిశాల (27) హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తే ఆమెను హత్య చేసి, అనంతరం ఇండియాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

నికిత చివరిసారిగా డిసెంబర్ 31న ఎల్లికాట్ సిటీలో కనిపించిందని ఆమె పాత స్నేహితుడు అర్జున్ శర్మ (26) పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఫిర్యాదు చేసిన వెంటనే అర్జున్ ఇండియాకు పారిపోవడంతో అతనిపై పోలీసులకు అనుమానం బలపడింది.

ఈ క్రమంలో సెర్చ్ వారెంట్ తీసుకున్న పోలీసులు అర్జున్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించగా, అక్కడ విగతజీవిగా పడివున్న నికిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తి పోటు గాయాలు ఉండటంతో ఇది హత్యేనని పోలీసులు నిర్ధారించారు.

నికితను హత్య చేసిన అనంతరం అర్జున్ శర్మ ఇండియాకు పారిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని కోరారు. ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తుకు వెళ్లింది.
మరోవైపు, హత్యకు గురైన నికిత గోడిశాల సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన యువతిగా సమాచారం. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

అమెరికాలో మరోసారి తెలుగు యువతి హత్య జరగడం పట్ల ప్రవాస తెలుగు సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

#Narendra

Exit mobile version