దస్తూరాబాద్ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ కానక యాదరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బూత్ లెవల్ అధికారులతో (బీఎల్డీ) సమావేశమై, 2002 నుంచి 2025 వరకు ఉన్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ సంతోష్, గిర్దావర్ ఆసిఫ్, ఆపరేటర్ వెంకటేష్, బీఎల్ఎలు పాల్గొన్నారు.




