కర్నూలు :
పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలి• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సంబంధిత సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన బళ్ళారి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో పలు కాలనీల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
ప్రతిరోజు మధ్యాహ్నం తరువాత పూడికతీత పనులు పూర్తిగా జరిగేలా చూడాలని, వారానికి కనీసం ఒక్కసారి ప్రతి వీధిలో పూడికలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులపై లేదా డ్రైనేజీ కాలువల్లో చెత్త వేస్తున్న వారిని గుర్తించి హెచ్చరించాలని కమిషనర్ ఆదేశించారు.
కార్యక్రమంలో శానిటేషన్ ఇంస్పెక్టర్లు అనిల్, దామోదర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
