కర్నూలు : కర్నూలు జిల్లా…విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం … డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు.• ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమానికి 84 ఫిర్యాదులు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన .
. డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ .కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో డిఐజి.
కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 84 ఫిర్యాదులు వచ్చాయి.వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) ఇన్ ఫ్రా ప్రాజెక్టుల పేరుతో భూములు ఇప్పిస్తానని మరియు రెవిన్యూ శాఖలో 6 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సల్కాపురం ప్రవీణ్ కుశల్ రూ. 52 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు, గీతా నగర్ కు చెందిన మల్లికార్జున ఫిర్యాదు చేశారు.
2) బాగా పండిన 8 క్వింటాల కంది పంటను రాత్రి వేళల్లో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు కోసుకొని వెళ్ళారని చర్యలు తీసుకోవాలని కర్నూలు, పసుపుల గ్రామ పంచాయితికి చెందిన రమణ ఫిర్యాదు చేశారు.
3) స్ధలం రిజిస్ట్రేషన్ దగ్గర చీటింగ్ చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని కర్నూలు మండలం, ఉల్చాల గ్రామానికి చెందిన చిన్న నాగరాజు ఫిర్యాదు చేశారు.
4) హ్యూజ్ ఆన్ లైన్ లో ప్రమోషన్ వీడియోలు చూడడం ద్వారా వారానికి, నెలకు తిరిగి డబ్బుులు ఇస్తామని చెప్పి నమ్మించి రూ. రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసాలు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కర్నూలు , క్రిష్ణనగర్ కు చెందిన ప్రభుదాస్ ఫిర్యాదు చేశారు.
5) సతీష్ రెడ్డి అనే వ్యక్తి గణేష్ నగర్ లోని రామచంద్రమిషన్ కు ధ్యానం నిమిత్తం వస్తూ పరిచయం చేసుకుని క్రెడిట్ కార్డు పరిమిషన్ తో , యాప్ సెటప్ యాక్సిస్ సెట్టింగ్ లో క్రిడెట్ కార్డు తో రూ. 8 లక్షలు , పర్సనల్ లోన్ క్రింద రూ. 2 లక్షలు తీసుకుని నమ్మించి మోసం చేసి తిరిగి చెల్లించకుండా కర్నూలు వదిలి వెళ్ళాడని కర్నూలు, గణేష్ నగర్ కు చెందిన వినీత్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటి పై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు హామీ ఇచ్చారు. ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, సిఐలు విజయలక్ష్మీ, కంబగిరి రాముడు లు పాల్గొన్నారు.




