వీధి దీపాల మరమ్మతులను ఆలస్యం చేయొద్దు• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 23 అర్జీలునగరంలోని ప్రతి వీధి విద్యుత్ కాంతులతో వెలగాలని, వీధి దీపాలు చెడిపోయిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా మరమ్మతులు చేపట్టి కొత్త దీపాలు అమర్చే విధంగా చొరవ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇంజనీరింగ్ విభాగంలోని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీధి విద్యుత్ దీపాల కోసం ఇప్పటికే రూ.60 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో త్వరితగతిన కొత్త దీపాలు తెప్పించి, మరమ్మతులకు గురైన వీధి దీపాల స్థానంలో వెంటనే కొత్తవి అమర్చాలని సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన ప్రజల నుంచి 23 ఫిర్యాదులను స్వీకరించారు
.కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ, కార్యదర్శి నాగరాజు, ఎస్.ఈ జె.రమణ మూర్తి, ఎం.ఈ మనోహర్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, ఆర్.ఓ జునైద్, టిడ్కో అధికారి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.వచ్చిన విన్నపాల్లో కొన్ని..
బుధవారపేట స్మశాన వాటిక వద్ద ముళ్లకంపలను తొలగించాలని, శునకాల బెడద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఇంచార్జీ పి.సురేష్, ప్రదీప్ తదితరులు కోరారు.
4వ తరగతి ఉద్యోగుల కాలనీలో తమ ఇళ్ల ఎదుట స్థలం అపరిశుభ్రంగా ఉందని, వెంటనే శుభ్రం చేయాలని సి.హెచ్.బాలచంద్ర విన్నవించారు.కుంతల కళామందిర్ వద్ద వీధి విద్యుత్ దీపాలు వెలగడం లేదని స్థానికులు రవి కుమార్, బాష తదితరులు ఫిర్యాదు చేశారు.




