బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం… గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం… సమాచారం అందుకున్న బాధితులు, స్థానికులు కలిసి మంటలు ఆర్పే ప్రయత్నం…
అగ్నిమాపక శాఖ తీరుతో వరి కుప్ప మొత్తం దగ్దం…
నీళ్లు లేని నీటి ట్యాంకర్…నిలకడ లేని సిబ్బంది… అతుకుల బొంతగా పైపు…ప్రభుత్వం ఇంతే ఇస్తుంది అంటూ బుకాయిస్తూ వ్యాఖ్యలు…
కేవలం 10 శాతం కాలిపోయి, కొద్దిపాటి నిప్పుతో ఉన్న కుప్పను అగ్ని మాపక అధికారులు నిర్లక్ష్యం చేసి , సరైన అంచనా లేకుండా జేసిబి తెప్పించి కుప్పని కదిలించమని చెప్పి, తీరా కదిలించాక నీళ్ళు లేవని వెళ్ళిపోయి మొత్తం దగ్దం అయ్యాక చోద్యం చూస్తూ ఉన్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు…
ఈ ఘటన నేపథ్యంలో అగ్ని మాపక శాఖ పనితీరు పై సామాన్యులు సంధిస్తున్న సూటి ప్రశ్నలు…
నీళ్లు ఉన్నాయో లేవో చేసుకోకుండానే కుప్పని కదిలించమని ఎలా చెబుతారు?
100 మీ.పైపు మొత్తం బొక్కలు పడిపోయి నిరుపయోగంగా మారిపోయినా, ఆ పైపుతోనే మంటలు ఆర్పే ప్రయత్నం ఎలా చేస్తారు?
నీళ్లు లేకుండా మంటలు ఆర్పే పని మీద అసలు బండి బయటకు ఎలా పంపుతారు??
అదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇలాగే చేస్తుందని నిర్లక్ష్యంగా సమాధానం…
ఈ మొత్తం ఘటన పట్ల తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బాధితులు…
ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు స్పందించాలని కోరుతూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ , హోం మంత్రి అనిత తదితర ప్రముఖుల దృష్టికి తీసుకెళ్ళడానికి సమాయత్తం అవుతున్న బాధితులు… ఇమ్మడిశెట్టి నరసింహారావు, తండ్రి ప్రసాదరావు
#Narendra




