మదనపల్లె నియోజకవర్గం 2వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు గొల్ల గిరి కృష్ణప్ప, మరియు ఎస్టేట్ ఉదయ్ అనారోగ్య కారణాలతో మంగళవారం మృతి చెందారు.
వీరి మృతి వార్త తెలిసిన వెంటనే, టిడిపి రాష్ట్ర తెలుగు యువత శ్రీరామ్ చిన్నబాబ సంఘటనా స్థలానికి చేరుకుని, కృష్ణప్ప, ఉదయ్ భౌతిక దేహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
యువ నాయకులు సింహం శ్రీకాంత్, నాయకులు వారి మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని సంతాపం తెలిపారు.




