చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా ముత్యాల ముగ్గుల పోటీలు
బాపట్ల: బాపట్ల జిల్లా చీరాలలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబిస్తూ అత్యంత ఘనంగా జరిగాయి.
స్థానిక సెయింట్ యన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం మహిళల కళాత్మక ప్రతిభతో, రంగురంగుల ముగ్గులతో కళకళలాడింది.ఈ పోటీలను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒంగోలు బ్రాంచ్ మేనేజర్ ఐ.వి. సుబ్బారావు గారు అధికారికంగా ప్రారంభించారు.
మహిళల సాంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమం చీరాల పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాను. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు, మరికొంతమంది ప్రతిభావంతులకు ఆరుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేశాను.
#Narendra




