రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా|| వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్
బాపట్ల: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా|| వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను ఆయన పరిశీలించి, ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ప్రతి సోమవారం ఆర్డీఓలు గ్రామాలకు వెళ్లి రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించాలని తెలిపారు. ప్రజల రెవెన్యూ సమస్యలు పూర్తిగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
#Narendra




