కర్నూలు : కోడుమూరు : ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది
ఈ సందర్భంగా MLA గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో కి వేస్తే విద్యుతు ఛార్జీలను పెంచమని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారని తెలియజేశారు.
జగన్ రెడ్డి విద్యుత్ ను 5.95 రూపాయలకు కొనుగోలు చేస్తే కుటమినోరభుత్వం అధికారంలోకి వచ్చాక 4.70 రూపాయలకు కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. అంతేకాకుండా వేల కోట్ల ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం పూర్తిగా భరించందన్నారు.అంతేకాకుండా ట్రూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 13 పైసలు కూటమి ప్రభుత్వం తగ్గించందన్నారు.జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకుయూనిట్ కు 3.50 వసూల్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.50 లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారన్నారు.2019 -2024 మధ్య ఉన్న ట్రూ అప్ ఛార్జీలు రూ 4498 కోట్లు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం ఒక చరిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు.
అంతే కాకుండా రాష్ట్రంలో రెన్యువల్ ఎనర్జీ కి ప్రాధాన్యం ఇస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.సోలార్ పవర్ ని ప్రోత్సహించేందుకు యస్సీ ఎస్టీ లకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లు బీసీ లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కి ఇంకో 20 వేలు అధిక సబ్సిడీతో కూటమి ప్రభుత్వం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




