*అమరావతి*
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం.
వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు.
గత 13 సమావేశాల్లో రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు, 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ.
పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాల్లో వివిధ పెట్టుబడులను ఆమోదించనున్న 14వ ఎస్ఐపీబీ సమావేశం.
2025 ఏడాదిలో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని… అదే ఉత్సాహంతో 2026లో పనిచేయాలని సూచించిన చంద్రబాబు.
రాష్ట్రాభివృద్ధికి మంత్రులు, అధికారులు అద్భుతంగా పని చేశారంటూ సీఎం చంద్రబాబు కితాబు.
14వ ఎస్ఐపీబీ సమావేశానికి హాజరైన మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, నారాయణ, టీజీ భరత్, కందులు దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు.
*ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…*
• 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు.
• గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చింది.
• రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి.
• భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి.
• టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయి.
• ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి.
• 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశాం… ఫలితాలు వచ్చాయి.
• విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేశాం.
• *13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించాం.
• *రూ. 4500 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించాం.*
• *విద్యుత్ కొనుగోళ్ల ధరలను కూడా తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.*
• *2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను రూ. 3.70కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.*
• *ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూడడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.*
• విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్లు వచ్చాయి.
• విద్యుత్ రంగంతోపాటు… వివిధ రంగాల్లో పెట్టుబడులు బాగా వచ్చాయి.
• దావోస్ సదస్సుకు వెళ్లాం ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయగలిగాం… విదేశీ కంపెనీలను ఆకర్షించగలిగాం.
• గూగుల్ సెంటర్ ఏపీకి తీసుకురావడానికి లోకేష్ కృషి చేశారు.
• సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుంది… ఆ కిక్ కోసం అందరూ పని చేయాలి
• స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫలితాలు రావాలనే లక్ష్యంతో పని చేయాలి.




