Saturday, January 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshహనుమాన్ సుందరకాండ పారాయణం లో పాల్గొన్న ఎమ్మెల్యే

హనుమాన్ సుందరకాండ పారాయణం లో పాల్గొన్న ఎమ్మెల్యే

కర్నూలు : నంద్యాల : డోన్
డోన్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యవంతంగా, శాంతి సమృద్ధులతో ఉండాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు  శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే  శ్రీమతి శ్ర కోట్ల సుజాతమ్మ నాల్గవ రోజు డోన్ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన శ్రీ హనుమాన్ సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా సుందరకాండ పర్యాయాన్ని రచించి గానం చేసిన  ఎం.ఎస్. రామారావు గారి మనవడు శ్రీ శ్రీనివాస్ స్వామిజీ  భక్తి శ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  హనుమంతుడిని ప్రత్యేకంగా ప్రార్థించి, నియోజకవర్గ ప్రజల సంక్షేమం, శాంతి భద్రతలు.

అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శ్రీ కోట్ల సుజాతమ్మ ,శ్రీమతి శ్రీ కోట్ల నివేదితమ్మ ,  పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సుందరకాండ పారాయణం అనంతరం స్వామిజీ గారు ఆశీర్వచనాలు అందించగా, కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా కొనసాగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments