Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవాట్సాప్ ద్వారా సేవలు : కర్నూలు డిఐజీ |

వాట్సాప్ ద్వారా సేవలు : కర్నూలు డిఐజీ |

కర్నూలు

కర్నూలు జిల్లా…వాట్సాప్ గవర్నెన్స్  ‘మన మిత్ర’లో  FIR డౌన్‌లోడ్ సౌకర్యం పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే FIR ప్రతిని పొందవచ్చని … డిఐజి,   కర్నూలు  జిల్లా ఇన్ చార్జీ  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు వెల్లడి జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఈ మేరకు సూచనలు జారీ. * పారదర్శకతతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి మనమిత్ర సేవలు ఉపయోగపడుతాయి.ప్రజలకు మరింత సులభమైన, వేగవంతమైన మరియు పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ – “ *మన మిత్ర”* సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని డిఐజి .

కర్నూలు  జిల్లా ఇన్ చార్జీ  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు జిల్లా ప్రజలకు సోమవారం  విజ్ఞప్తి చేశారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు…ప్రతి FIR నమోదు అనంతరం ఫిర్యాదుదారులు తమ FIR ప్రతిని పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.

FIR డౌన్‌లోడ్ విధానం:*  *ఫిర్యాదుదారు 95523 00009 నంబర్‌ను తన మొబైల్‌లో సేవ్ చేసి వాట్సాప్‌లో “Hi” పంపాలి.*  *మెనూ నుండి Police Services → Download FIR ఎంపిక చేసుకోవాలి.*  *అవసరమైన వివరాలను నమోదు చేసి FIR ప్రతిని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.* ఈ సేవల ద్వారా ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు, పోలీస్ సేవల్లో మరింత పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ అధికారులు ఈ సేవపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించామని… ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  డిఐజి,  కర్నూలు  జిల్లా ఇన్ చార్జీ  ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్  గారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments