Friday, January 9, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకోడి, పొట్టేల్ పందేలు చట్టవిరుద్ధం: కలెక్టర్ |

కోడి, పొట్టేల్ పందేలు చట్టవిరుద్ధం: కలెక్టర్ |

కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: సంక్రాంతి  పండుగ సందర్భంగా కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం చట్టరీత్య నేరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, తెలిపారు.

బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన కోడి పందాలు నిర్వహించడం పాల్గొనడం చట్టరీత్యా నేరమని గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్  ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంక్రాంతి  పండుగ సందర్భంగా కోడి పందేలు మరియు పొట్టేళ్ళ  పందేలు నిర్వహించడం పాల్గొనడం చట్టరీత్య నేరమని తెలిపారు.

కోళ్లకు కాలికి కత్తులు కట్టడం గాయాలు చేయడం మూగ జీవులకు హాని కలిగించి ఆనందించడం మరియు  మూగజీవాలపై పందేలు కాయడం  నేరం అవుతుందన్నారు. కోడి పందేలు నిర్వహించిన, ప్రోత్సహించిన, పాల్గొనిన వారిపై చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకొనబడును.

ఈ ఉత్తర్వులు  ఉల్లంఘించిన వారి పై సెక్షన్ 10 – ఆంధ్ర ప్రదేశ్ గేమింగ్ ఆక్ట్ 1974 మరియు సెక్షన్ 34- జంతుహింస నివారణ చట్టం 1960 ల ప్రకారం చట్ట రీత్యా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందన్నారు.

కోడి పందాలు నిర్వహించడం పాల్గొనడం చట్టరీత్యా నేరమని గోడ పత్రికను జిల్లా కలెక్టర్ తో పాటుగా  పశుసంమిధక శాఖ జెడి డాక్టర్ వేణుగోపాల్, ఆర్డీఓ పి.గ్లోరియా, డి యం & హెచ్ ఓ.డాక్టర్ విజయమ్మ, సివిల్ సప్లైస్ డి యం.శ్రీలక్ష్మి,కలెక్టరేట్ ఏ ఓ.మల్లిఖార్జున్ రావ్,డి ఎస్ పి.  ఆవిష్కరించారు.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments