జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు. చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్.
చీరాల, బాపట్ల జిల్లా: జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు. చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్.
సరైన ధ్రువపత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్, 100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా కార్డెన్ అండ్ సెర్చ్.
గంజాయి ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే ఉపేక్షించం.
యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా జిల్లాలో కార్డెన్ అండ్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు తెలిపారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు బుధవారం వేకువ జాము నుండి ఉదయం 9 గంటల వరకు బాపట్ల జిల్లా, చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ న్యూ కాలనీ, మొగిలి రంగయ్య కాలనీ, ఆదినారాయణపురం ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్‌లు నిర్వహించారు.
చీరాల డీఎస్పీ ఎం.డి. మోయిన్ ఆధ్వర్యంలో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్ న్యూ కాలనీ, మొగిలి రంగయ్య కాలనీ, ఆదినారాయణపురం ప్రాంతాల్లో నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్‌లో చీరాల 1 టౌన్, చీరాల 2 టౌన్, చీరాల రూరల్ సర్కిల్, ఇంకొల్లు సర్కిల్ సీఐలు ఎస్. సుబ్బారావు, బి. నాగభూషణం, పి. శేషగిరి, వై.వి. రమణయ్యలు, చీరాల 1 టౌన్, చీరాల 2 టౌన్, చీరాల రూరల్, ఇంకొల్లు, చిన్నగంజాం, కారంచేడు పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు, సీసీఎస్ పోలీస్ సిబ్బంది, చీరాల సబ్ డివిజన్ పరిధిలోని మొత్తం 150 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం 5:00 గంటల నుండి 9:00 గంటల వరకు నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను, 2 ఆటోలను సీజ్ చేశారు. నాటు సారా తయారీకి భూమిలో గుంతలు తీసి దాచి ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి వెలికితీసి ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ గారు సమాజంలో గంజాయి, మాదక ద్రవ్యాలు, నాటు సారా వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, వాటి నిర్మూలనకు ప్రజలు సహకరించాలని తెలిపారు. అలాగే స్థానిక ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
కార్డెన్ అండ్ సెర్చ్‌ను ఉద్దేశించి జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, ప్రధానంగా జిల్లాలో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే ఉద్దేశంతో, అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే నేరస్తులను గుర్తించ్చేందుకు, నేరాల్లో ఉపయోగించిన వాహనాలను, దొంగిలించబడిన వాహనాలను గుర్తించేందుకు కార్డెన్ అండ్ సెర్చ్‌లు నిర్వహించడం జరుగుతుందన్నారు. చెడు నడత కలిగిన వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచామని తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, నాటు సారా తయారీ చేసినా, గంజాయి ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను అనుమానిత వాహనాలుగా పరిగణించి, వాటిని సీజ్ చేసి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామన్నారు.
యువత సరదా కోసం ఒక్కసారి గంజాయి వంటి మత్తు పదార్థాలు ఉపయోగించినా, వాటికి బానిసలుగా మారి ఆ ఊబిలో నుండి బయటకు రావడం కష్టతరమవుతుందన్నారు. ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. యువత గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా నాటు సారా తయారీ, విక్రయాలు, గంజాయి క్రయవిక్రయాలు, వినియోగం లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన యెడల వెంటనే సంబంధిత స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు లేదా డయల్ 112 నంబర్‌కు కాల్ చేసి ప్రజలు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.
#Narendra




