పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ అవగాహన, ఫ్రెండ్ పోలీస్, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాల వంటి అంశాలపై సిబ్బంది డీఎస్పీకి వివరించారు #కొత్తూరు మురళి.




