బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో పోక్సో చట్టాలు, సైబర్ నేరాలు, ముఖ్యంగా మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలు విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించిన పోలీస్ అధికారులు.
విద్యార్థి దశలోనే మాదకద్రవ్యాల వలలో చిక్కుకుంటే జీవితం అంధకారంగా మారిపోతుందని హెచ్చరించారు.
డ్రగ్స్ వాడకం కేవలం వ్యక్తిగత నష్టమే కాక సమాజానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు.
విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన విధానం అవలంబించాలని తెలిపారు.
సైబర్ నేరాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, డిజిటల్ అరెస్ట్ పలు ఇతర రకాల సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.
యువత భవిష్యత్తు రక్షణ కోసం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
#Narendra




