మహబూబాబాద్, కొత్తగూడ, జనవరి 7(భారత్ అవాజ్): మండల విద్యా వనరుల కేంద్రం కొత్తగూడ కార్యాలయంలో గుమ్మడి లక్ష్మీనారాయణ మండల విద్యాధికారి గారిచే డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ కొత్తగూడ మండల శాఖ డైరీ గోడపత్రిక టేబుల్ క్యాలెండర్ లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఉన్నతమైన ఆలోచనలు కలిగి సామాజిక అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నెల్లుట్ల భాస్కర్ డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వo వద్ద బకాయిగా ఉన్న ఆరు విడుతల దినసరీ భత్యాన్ని (D.A ) విడుదల చేయాలని, పిఆర్సి నివేదికను తెప్పించుకొని, పి ఆర్ సి ని అమలు చేయాలని.
రిటైర్ ఉపాధ్యాయులకు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్. విష్ణువర్ధన్ రావు, చాట్ల పోట్టయ్య, వాసం. ప్రభాకర్, ఎన్. సుమన్, డి .సుధాకర్, ఏ. కోటేశ్వర్, డి.సరస్వతి, ఈ.ప్రమీల, ఏం. సూరయ్య, టి .బిక్షపతి, బి.రమేష్, యాప .బ్రహ్మయ్య, ఎం రవి, డి .లక్ష్మణ్, బి. వెంకన్న ఓ. సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.




