కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురై గాయలతో బాధపడుతున్న ముత్తిన రామకృష్ణ యాదవ్ ని, వారి కుటుంబ సభ్యులను జిల్లా BC సంఘం నాయకులు పాతకొత్తూరు వారి నివాసానికి విచ్చేసి పరామర్శించారు.
బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని నాన్- బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, కేసును పక్కదారి పట్టించే విధంగా చెయ్యొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై ఇంత దారుణంగా, విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ.
స్థానిక ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే ప్రయత్నాలు మానుకోవాలని, వారిని వెనకేసి వస్తే ఊరుకునేది లేదని బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బిసి సంఘాలు ఆధర్వ్యంలో ఉద్యమం చేపడతామని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది..
ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బాధితుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్న మంచంపైనుండే తమ ఇంటికి వచ్చిన జిల్లా BC నాయకులకు చెప్పడం జరిగింది.. ఈ బాధితుడుని పరామర్శించిన వారిలో తెలుగు జనతా పార్టీ వ్యస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు యాదవ్, అల్లి రాజుబాబు యాదవ్, జిల్లాలో ఉన్న BC సంఘ నాయకులు, కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
తరువాత మంచంపై ఉన్న బాధితుడిని తీసుకుని తేటగుంట యనమల రామకృష్ణుడు గారి క్యాంప్ కార్యాలయానికి తీసుకునివెళ్లి నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని కోరారు…
#Dadala Babji
