మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని షిరిడీ హిల్స్ ప్రాంతంలో నివసించే సుబ్బారావు, అమర్ అనే వ్యక్తులు మహారాష్ట్ర రాయగడ్ ప్రాంతం నుండి గంజాయిని అక్రమంగా తరలిస్తూ జగద్గిరిగుట్ట పైన ఉన్న చుట్టు పక్కల బస్తీలకు అనగా, షిరిడిహిల్స్, రాజీవ్ గృహకల్ప, కోన మహాలక్ష్మి నగర్, తులసి నగర్.
ఆల్విన్ కాలనీ, వెంకటేశ్వర్ నగర్, జగద్గిరి నగర్, శ్రీనివాస్ నగర్, గాజులరామారం, చుట్టుపక్కల బస్తీలకు గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారినుండి సుమారు 1.3 kg ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు నిందితులను జైలుకు తరలించారు.
#sidhumaroju




