Friday, January 9, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబాపట్ల విద్యార్థుల విజయంతో జిల్లా గర్వం |

బాపట్ల విద్యార్థుల విజయంతో జిల్లా గర్వం |

బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణం . బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించిన విద్యార్థులను అభినందించి. బాపట్ల జిల్లా నుండి విద్యార్థులు రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు.
బాపట్ల: బుధవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు  డిఇఓ  శ్రీనివాస్  తో కలసి  విద్యార్థులు  జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ, “బాపట్ల జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో అగ్రస్థానాలు సాధించడం జిల్లాకు గర్వకారణమని వీరి కృషి, అంకితభావం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. వృత్తి విద్య ద్వారా భవిష్యత్తులో మరిన్ని  మంచి అవకాశాలు సృష్టించుకోవాలని ఆకాంక్షిస్తు విద్యార్థులను ప్రశంసించారు.
డి ఈ ఓ మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీలు (State Level Skill Competition 2025-26) డిసెంబర్ 29, 2025న విజయవాడలోని మురళీ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగాయి. 10 వృత్తి విభాగాల్లో నిర్వహించిన ఈ విజయాలు బాపట్ల జిల్లా విద్యారంగానికి కీర్తి తెచ్చాయని డి ఈ ఓ ఈ సందర్భంగా విజేతలైనకె.అక్షయ,కె.సాయి చరిస్మ్, కె.ఈశ్వరమ్మ,సి హెచ్.వైష్ణవి,పి.ఉన్నవెంకటలక్ష్మి విద్యార్థినిలు అభినందించారు.

ఈ పోటీల్లో ప్రతి విభాగానికి మొదటి స్థానానికి రూ.25,000, రెండవ స్థానానికి రూ.15,000, మూడవ స్థానానికి రూ.10,000 నగదు బహుమతులు ప్రదానం చేశారు.ఈ పోటీల్లో బాపట్ల జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలిచారు. వారి వివరాలు:
స్కూల్: జడ్‌పి హైస్కూల్, మేడరమెట్లహెడ్‌మాస్టర్: శ్రీమతి టి. అంజనీ దేవి (సంప్రదింపు: 9492813696)వృత్తి విభాగం: హెల్త్‌కేర్వృత్తి శిక్షకురాలు: శ్రీమతి కె. రమ్య లత (సంప్రదింపు: 8106998009)సాధించిన స్థానం: మొదటి స్థానంనగదు బహుమతి: రూ.25,000
స్కూల్: ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ (బాలికలు), నక్షత్రనగర్హెడ్‌మాస్టర్: శ్రీమతి జి. రాగిణివృత్తి విభాగం: అగ్రికల్చర్వృత్తి శిక్షకురాలు: శ్రీ సుద్దపల్లి సిరి వెన్నెల  (సంప్రదింపు: 9553541074)సాధించిన స్థానం: రెండవ స్థానంనగదు బహుమతి: రూ.15,000
గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత, వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ, సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు.

“మా జిల్లా విద్యార్థులు హెల్త్‌కేర్, అగ్రికల్చర్ విభాగాల్లో రాణించడం సంతోషదాయకం. వీరి విజయం జిల్లా విద్యాశాఖ కృషికి ఫలితం.”గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీమతి ఎం. చారులత తన అభినందనలు తెలిపారు: “బాలికలు వృత్తి నైపుణ్యాల్లో రాణిస్తున్నారు. ఈ విజయం బాలికల సాధికారతకు నిదర్శనం

.”వొకేషనల్ కోఆర్డినేటర్ శ్రీ వి. సత్యనారాయణ మాట్లాడుతూ: “వృత్తి శిక్షణ ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయిలో పోటీ పడుతున్నారు. ఈ విజయాలు మరిన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి.”సంబంధిత హెడ్‌మాస్టర్లు, వృత్తి శిక్షకులు కూడా విద్యార్థుల కృషిని, శిక్షణను కొనియాడారు.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments