Saturday, January 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబాలింత మృతి కేసులో ఒంగోలులో పోస్టుమార్టం |

బాలింత మృతి కేసులో ఒంగోలులో పోస్టుమార్టం |

చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.

చీరాల: చీరాలలోని శంకర్ ఫెర్టిలిటీ అండ్ లాప్రోస్కోపిక్ ఆసుపత్రిలో ప్రసవం అనంతరం మరణించిన బాలింత సౌమ్య మృతదేహానికి రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్లు మంగళవారం ఒంగోలులో పోస్టుమార్టం నిర్వహించారు.కాగా సౌమ్య మృతికి డాక్టర్ రామకృష్ణ హనుమాన్,డాక్టర్ గోరంట్ల రాజేష్ లే కారణమని ఆమె తండ్రి ఏడుకొండలు, హైకోర్టు న్యాయవాది రజని మీడియాకు చెప్పటం విదితమే.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చీరాల వన్ టౌన్ పోలీసులు పోస్టుమార్టంకు వెంటనే ఏర్పాట్లు చేయించారు.కాగా పోస్టుమార్టం నివేదికను బుధవారం ఇస్తామని వైద్యులు చెప్పారని,అది వచ్చాక అందులోని అంశాలను బట్టి తమ కార్యాచరణ ప్రణాళికను రూపుదిద్దుకుంటామని హైకోర్టు న్యాయవాది రజని చెప్పారు.

ఏదిఏమైనా నిర్లక్ష్యం వహించిన ఇద్దరు చీరాల డాక్టర్లను కాపాడే ప్రయత్నాలు జరిగితే కోర్టులో న్యాయం కోసం పోరాడుతామన్నారు.
చీరాలలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రామకృష్ణ హనుమాన్,డాక్టర్ గోరంట్ల రాజేష్ ల నిర్లక్ష్యం కారణంగా సౌమ్య అనే బాలింత మృతి చెందిందని హైకోర్టు అడ్వకేట్ రజిని శనివారం మీడియాకు చెప్పారు.

డిసెంబర్ 16వ తేదీ ఉదయం ఆరు గంటలకు సౌమ్యకు డాక్టర్ రామకృష్ణ హనుమాన్ కు చెందిన శంకర్ లాప్రోస్కోపీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్లో సిజేరియన్ ఆపరేషన్ జరిగిందని, కానీ ఆమెకు సాయంత్రం వరకు స్పృహ రాకపోయినా డాక్టర్ పట్టించుకోలేదన్నారు.తదుపరి గోరంట్ల రాజేష్ ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడకు మూడు గంటలు వృధా చేశారన్నారు.

చివరకు పరిస్థితి విషమించడంతో గుంటూరు తరలిస్తుండగా ఆ రాత్రి సౌమ్య మార్గమధ్యంలో మృతి చెందిందన్నారు.డాక్టర్లు కనుక ఆలస్యం చేయకుండా ఆమెను వెంటనే గుంటూరు తరలించి ఉండుంటే ఆమె బతికేదన్నారు.కేవలం ఆ ఇద్దరు వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించినందున వారిపై తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రజని డిమాండ్ చేశారు.

లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.మీడియా సమావేశంలో సౌమ్య తండ్రి పి ఏడుకొండలు సిఐటియు నాయకుడు వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments