రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
బాపట్ల: రాజధాని అమరావతి నుంచి డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ డి. సాయి ప్రసాద్, ఐ.ఏ.ఎస్ గారు , సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్ జయలక్ష్మి , ఐ.ఏ.ఎస్ గారు కలిసి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం నిర్వహించారు.
కుల ధ్రువీకరణ పత్రాలను సుమోటోగా విచారించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా||వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్ గారు తెలిపారు.
ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా బాపట్ల జిల్లాలో కుల ధ్రువీకరణ పత్రాలను సుమోటోగా విచారించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీలను నిశితంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని డబ్ల్యూ ఆర్ డి స్పెషల్ సీఎస్ ఆదేశించారు. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించకూడదని, పునరావృత అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రెవెన్యూ క్లినిక్‌ల నిర్వహణ బాధ్యత ఆర్డీఓలదేనని స్పష్టం చేశారు.
#Narendra




