37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా, పుంగునూరు పట్టణంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, రోడ్డు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎంవీఐ సుప్రియ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీ బుధవారం జరిగింది
# కొత్తూరు మురళి.




