కర్నూలు : కర్నూలు సిటీ :
భవన నిర్మాణాల వ్యర్థాల నిర్వహణ పటిష్టం• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్నగరంలో సి & డి (కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్) వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం కమిషనర్ తన క్యాంపు కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సి & డి వేస్ట్ మేనేజ్మెంట్ విధానంపై సమావేశం నిర్వహించారు.
నగర సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణకు సి & డి వ్యర్థాల నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. నిర్మాణ, కూల్చివేత పనుల నుంచి వచ్చే సి & డి వ్యర్థాలను ప్రజలు ఎక్కడబడితే అక్కడ పడేయకుండా యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. సి & డి వ్యర్థాల సేకరణ, తరలింపుకు ట్రాక్టర్‌కి రూ.500 చొప్పున ప్రకారం నామమాత్రపు రవాణా చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు.
అధికారికంగా నియమిత వ్యవస్థ ద్వారానే తరలించాలని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు సి & డి వ్యర్థాలను తరలించడం అనుమతించబోమని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, సూపరింటెండెంట్ సుబ్బన్న, తదితరులు పాల్గొన్నారు.




