కర్నూలు : కర్నూలు సిటీ :
వైసీపీని చూసి నవ్వుకుంటున్నారు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ….వైసీపీ రాజకీయాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. గురువారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రజల ముందు బొక్కబోర్లా పడిందన్నారు. అమరావతిపై వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు నాగేశ్వర యాదవ్, ఠాగూర్ ఉన్నారు.




