జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు
మంచి నీటి సౌకర్యం కోసం వంద కోట్లు మంజూరు
ఎ.ఎమ్.సి చైర్మన్, డైరెక్టర్ల అభినందన సభలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్.రాజు, నక్కా ఆనందబాబు హాజరు
ఎ.ఎమ్.సి సభ్యులకు అభినందనలు తెలిపిన జిల్లా టిడిపి అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్,
జగ్గయ్య పేట: పట్టణ అభివృద్ధిపై ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణానికి శాశ్వత పరిష్కారంగా మంచి నీటి సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసిందని, అలాగే రాబోయే రోజుల్లో జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఎ.ఎమ్.సి) నూతన చైర్మన్‌గా మల్లెల సీతమ్మతో పాటు మరో 13మంది ఎ.ఎమ్.సి డైరెక్టర్లు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జగ్గయ్య పేట మార్కెట్ యార్డ్ లో గురువారం అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నక్కా ఆనందబాబు, ఎమ్.ఎస్.రాజు పాల్గొనగా, అతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, టిడిపి జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమని స్పష్టం చేశారు. దళిత మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ మల్లెల సీతమ్మను ఎ.ఎమ్.సి చైర్మన్‌గా నియమించటం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఎ.ఎమ్.సి సభ్యులకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే ముఖ్యఅతిథులుగా హాజరైన మడకశిర ఎమ్మెల్యే ఎమ్.ఎస్.రాజు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబులకు కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ హయంలో నిర్వీర్యంగా మారిన మార్కెట్ యార్డులకు పూర్వ వైభవం తీసుకురావడమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని కొనియాడారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సిక్స్ లైన్ అభివృద్ధిలో జగ్గయ్యపేట కీలక పాత్ర పోషించబోతుందని, కోదాడ – జగ్గయ్యపేట రహదారికి కూడా మంజూరు లభించిందని తెలిపారు. దీనివల్ల ప్రాంత అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తో కలిసి జగ్గయ్యపేట అభివృద్దికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎ.ఎమ్.సి వైస్ చైర్మన్ అడుసుమిల్లి ప్రభాకర్ రావు , డైరెక్టర్లు కొర్రకుట్టి వెంకాయమ్మ , ఏసు పోగు వెంకటేశ్వర్లు , సయ్యద్ జాన్ బాషా, ఇస్లావత్ శ్రీను , వల్లం కొండ లక్ష్మి , తుడుము శైలజ, నందమూరి మాధవి , బొల్ల నాగమణి , గింజుపల్లి రోశయ్య, కోరంపల్లి ఓంకార లక్ష్మి , గుత్తికొండ శ్రీనివాసరావు , దేవరశెట్టి నాగప్రసాద్ , గుంజ నరసయ్య లతో పాటు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఎన్డీయే కూటమి నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు,వ్యవసాయ అధికారులు, పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




