సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటం చేస్తాం అని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు రాజేశ్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యా యుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతన క్యాలెండర్ను ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఆ శాఖ నాయకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.
