అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి గురువారం జరిగిన హుండీ లెక్కింపులో రూ. 48,85,165 ఆదాయం వచ్చినట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. 31 రోజుల లెక్కింపులో నగదుతో పాటు 19 గ్రాముల బంగారం, 292 గ్రాముల వెండిని భక్తులు ముడుపులుగా చెల్లించారు. రణభేరి గంగమ్మ హుండీ ద్వారా రూ. 28,943 ఆదాయం సమకూరింది# కొత్తూరు మురళి.




