కర్నూలు :
మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్కర్నూలు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సచివాలయాల సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. గురువారం ఆయన ఇండోర్ స్టేడియం, ఎగ్జిబిషన్ గ్రౌండ్లను పరిశీలించారు. ఆటలకు అవసరమైన ఏర్పాట్లు, టాయిలెట్లు, తాగునీరు, లైటింగ్ వంటి ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు రోజూ ఎదుర్కొనే పనిభారం, బాధ్యతల ఒత్తిడిని తగ్గించే దిశగా క్రీడా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెలవు దినాలైన శని, ఆదివారాల్లో అన్ని విభాగాల మున్సిపల్ ఉద్యోగులతో పాటు సచివాలయాల సిబ్బందికి ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.పురుషుల కోసం క్రికెట్, షటిల్, వాలీబాల్, క్యారమ్స్, చెస్ వంటి ఐదు రకాల పోటీలు, మహిళల కోసం టెన్నికాయిట్, త్రో బాల్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, షటిల్, రంగోలి వంటి ఏడు రకాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 14న సంక్రాంతి పండుగ పండుగ నాడు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని,
26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు.ఈ తరహా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉద్రిక్తత తగ్గి, శారీరక చురుకుదనం పెరుగుతోందన్నారు. విభాగాల మధ్య సమన్వయం పెరగడంతో పాటు, సహోద్యోగుల మధ్య పరస్పర అవగాహన, సహకార భావం బలపడుతోందని, ఇది కార్యాలయ వాతావరణాన్ని సానుకూలంగా మార్చి, పని పట్ల నిబద్ధతను పెంచుతోందని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ గిరిరాజ్, సచివాలయ సిబ్బంది ఉప్పరి నవీన్, కావ్య, రాజు, తదితరులు పాల్గొన్నారు.




