కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. పంబ నుంచి కాలినడకన సన్నిధానం చేరుకున్న వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయపండితులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు# కొత్తూరు మురళి.




