Saturday, January 10, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసత్తెనపల్లిలో ఆత్మీయ సమావేశం – మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

సత్తెనపల్లిలో ఆత్మీయ సమావేశం – మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి*

*సమావేశంలో పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, వైసిపి నాయకులు*

*ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా కూడా డౌన్ అయిపోయాయి – వెలంపల్లి*

*కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయయి – వెలంపల్లి*

*కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయయి – వెలంపల్లి*

*విజయవాడ, పొదిలి, దర్శి మరియు పిడుగురాళ్ల లో ఆర్యవైశ్యుల పై జరిగిన దాడులను ఖండిస్తున్నాం – వెలంపల్లి*

*ఆర్యవైస్యుల పై దాడులు జరుగుతుంటే ఆర్యవైశ్య సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదు – వెలంపల్లి*

*ఆర్యవైశ్య మహాసభ, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ, ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘాలు చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు – వెలంపల్లి*

*పొట్టి శ్రీరాములు విగ్రహం పేరుతొ చందాలు వాసులు చేయడం హేయం – వెలంపల్లి*

*ఆర్యవైస్యులంటే కూటమి ప్రభుత్వానికి చులకన – వెలంపల్లి*

*ఆంధ్రరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ప్రభుత్వ నిధులతో కట్టాలి – వెలంపల్లి*

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపల్ ఆఫిస్ ఏరియాలో గల తళ్ళం సతీష్ గారి నివాసం నందు గురువారం నాడు సత్తెనపల్లి ప్రాంత ఆర్యవైశ్య ప్రముఖులతో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం పాల్గొన్న సత్తెనపల్లి ప్రాంత ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలల పూర్తయిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యాపారాలన్నీ పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఏ వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో కూడా ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల ద్వారా సుమారు 40 నుంచి 50 వేల కోట్లు రూపాయలు ప్రజలకి అందాయన్నారు. వ్యాపారాలు అభివృద్ధి చెందినాయన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా సంక్షేమ పథకాల అమలు గందరగోళం అయిపోయిందన్నారు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు అందకుండా కనీసం అభివృద్ధి అనేది కనపడని పరిస్థితిలో ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా అమరావతి అని చెప్తున్నారు కానీ అమరావతిలో ప్రతిరోజూ కూడా రైతులు ఇదివరకు మాకు రాజధాని కావాలన్న రైతులు ఈరోజు ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో సోషల్ మీడియా ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలందరూ చూస్తున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే విజయవాడలో ఒ ప్రేమోన్మాది ఒక ఆర్యవైశ్య సోదరుడైన శ్రీ రామ్ ప్రసాద్ ను నడి రోడ్డు పై హతమార్చారన్నారు, శ్రీ రామ్ ప్రసాద్ విజయవాడ లో నిర్వహించే చిల్లరకొట్టు మూసుకొని తన పాపతో ఇంటికి వస్తుంటే ఆ ప్రేమోన్మాది వెనకాల బండి మీద వెంబడించి బండి ఆపి శ్రీరామ్ ప్రసాద్ హతమార్చారన్నారు. ఈరోజు వరకు కూడా ఆ ఘటన పై అత్తీగతీ లేదని, కనీసం ఆ కుటుంబాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఆదుకున పరిస్థితి లేదన్నారు. ఎందుకంటే కుటుంబ యజమాని చనిపోయాడు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం స్పందించి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తదనుకున్న పరిస్థితి కూడా లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇటీవల పొదిలి గాని, దర్శి గాని, అదేవిధంగా పిడుగురాళ్ల గాని, ఎక్కడ చూసినా ఆర్య వైస్యుల పై దాడులు వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. పొదిలిలో గనుక చుస్తే ఒక ఆర్యవైశ్య సోదరుడు అవినాష్ రోడ్డు మీద లారీ అపాడని చెప్పి అమానుషంగా ఎస్.ఐ అవినాష్ ని స్టేషన్ కి తీసుకెళ్లి అమానుషంగా కొట్టడం. అతను దెబ్బలు తగిలి గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వెళ్తే మళ్ళీ నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి నా మీద కంప్లైంట్ చేస్తావా అని చెప్పి మళ్ళీ స్టేషన్ పిలిపించి కొట్టడం. ఇదెంటి అని అడిగినందుకు తన తండ్రి కోటేశ్వరరావుని కూడా కొట్టడం జరిగింది. అప్పుడు పొదిలి నియోజకవర్గం పొదిలి టౌన్ అంతా కూడా బంద్ చేస్తే చంద్రబాబు సైతం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడన్నారు. అయ్యో అని చెప్పి బాధపడ్డాడు తప్ప చర్యలు ఏమి లేవన్నారు. కనీసం ఆ ఎస్.ఐ ని వి.ఆర్ లో పంపించి చేతులు దులుపుకున్నాడు తప్ప, ఎస్.ఐ మీద ఎందుకు క్రిమినల్ కేసు కట్టలేదని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని రక్తం వచ్చేటట్టు కొడితే ఎందుకు అతని మీద ఇప్పటివరకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదన్నారు. అతన్ని సస్పెండ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేవలం కంటితుడుపు చర్య ద్వారా ఏదో వి.ఆర్ అని చెప్పి కొద్ది రోజులు పక్కన పెడితే సరిపోతుందా అన్ని అన్నారు. దర్శి మండలంలో చూసుకుంటే గనుక సత్యనారాయణ అని చెప్పి రేషన్ డీలర్. అతన్ని ప్రభుత్వం ఏర్పడ్డాక వేధిస్తున్నారన్నారు. చాలా మంది రేషన్ డీలర్లు కావచ్చు, చిరువ్యాపారులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు ఆర్యవైశ్యులు ఉంటారన్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా గాని వ్యాపారం వాళ్ళ స్థాయిలో చేసుకుంటారన్నారు. మా ప్రభుత్వం వచ్చింది కదా నీ రేషన్ స్టోర్ మాకు

అప్పచెప్పాలి అని చెప్పి బలవంతంగా అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అతన్ని గొడవ చేస్తే అతను కోర్టుకి వెళ్లి స్టే తెచ్చుకున్నాడన్నారు కానీ అతన్ని కిడ్నాప్ కూడా చేశారన్నారు, అతను తన ప్రాణాలను కాపాడుకోవడానికి గుడిలోకి వెళ్లి తలదాచుకుంటే అతని మీదే తప్పుడు కేసులు పెట్టి… ఇబ్బందులకు గురి చేశారన్నారు. పిడుగురాళ్ల చూసుకుంటే గనుక జ్యోతిది చాల దారుణమైన విషయమన్నారు. వాళ్ళకేమైనా ఆర్థిక లావాదేవీలు ఉంటే ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా వాళ్ళు ఏదైనా కోర్టుల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు కానీ సివిల్ వ్యవహారంలో కూడా పోలీసులు జొరపడి ఒక మహిళను సాయంత్రం 7:30 కి స్టేషన్ కి పిలిపించి రాత్రి ఒంటిగంట వరకు కూడా స్టేషన్ లో ఎటువంటి మహిళా కానిస్టేబుల్స్ లేకుండా ఆ టైం వరకు ఉంచుకునే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారన్నారు. కేవలం ఆర్యవైశ్యులని చెప్పి చులకన మీ అందరికీ అన్నారు. వీళ్ళేం మాట్లాడరులే, వీళ్ళు మనం చెప్తే భయపడతారు అని చెప్పి అనుకునే
భావనలో ఈ కూటమి ప్రభుత్వం కనబడుతుందన్నారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఏ విధంగా మంచిగా ఉంటారో వాళ్ళను ఇబ్బందిపెడితే ఎదురు తిరిగితే కూడా అదే విధంగా తిరగబడతారన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం ఉండదన్నారు. ఈ రాష్ట్రం ఏర్పడింది అంటే పొట్టి శ్రీరాములు గారి వల్ల ఏర్పడిందన్నారు, ఆయన ఆర్యవైశ్యుడేనన్నారు . ఆయన ప్రాణాలు సైతం త్యాగం చేశారన్నారు. అటువంటి త్యాగం చేసే కెపాసిటీ ఆర్యవైశ్యులకు ఉంటుందన్నారు. అటువంటి ఆర్యవైశ్యులని చిన్నగా చూడటం, ఆర్యవైశ్యులంటే బెదిరిస్తే భయపడతారు అని చెప్పి అనుకోవడం, ఇబ్బంది పెడతాము వాళ్ళ దగ్గర దోచుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదని కూటమి ప్రభుత్వానికి సూటిగా హెచ్చరిస్తున్నామన్నారు. ఇకనైనా గాని మీరు ఈ దాడులు గనుక ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆర్యవైశ్యలంతా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లాగా పని చేస్తున్నాయన్నారు. ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘం కావచ్చు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు?. ఇంతమంది వైశ్యులు ఇబ్బంది పడుతుంటే బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు?. మీరు చంద్రబాబుకు తొత్తుల్లాగా పనిచేయడానికి మీ సంఘాలు పెట్టుకుంది అని దుయ్యబట్టారు?. మీకు ఆ సంఘాలలో పనిచేయడం చేతకాకపోతే దిగిపోండని హితవుపలికారు. పార్టీలకు సంఘాలు తాకట్టు పెట్టేసి ఆర్యవైశ్యుల పరువుకు భంగం కలిగించిందన్నారు ఇంతమంది ఆర్యవైస్యులు ఇబ్బంది పడుతున్నా గాని ఎక్కడా పట్టించుకోకపోవడం అనేది ఆర్యవైశ్య మహాసభకు కానియ్యండి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు కానియ్యండి, ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘం కానియ్యండి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లాగా పని చేస్తున్నాయన్నారు. ఇంతమంది ఆర్యవైశ్యులకు ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క సంఘమైనా వెళ్లి పలకరించిందా ఎవరినైనా గాని అని ప్రశ్నించారు?. అంటే మీరు చంద్రబాబుకు తొత్తులా పని చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆర్యవైస్యుల కోసం పని చేయని ఏ సంఘాన్ని అయినా సరే ఉపేక్షించే పని లేదన్నారు. ఆర్యవైశ్యులు ఎక్కడ ఇబ్బంది పడ్డా అన్ని సంఘాలు ఏకం కావాలన్నారు. రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలన్నారు. ఆర్యవైశ్యుల మీద దాడులు ఆపకపోతే మాత్రం ఒక ఆర్యవైశ్య వ్యక్తిగా కావచ్చు, వై.ఎస్.ఆర్.సి.పి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కావచ్చు మేమందరం కూడా గళం విప్పుతామని హెచ్చరించారు. ఆర్యవైస్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉద్యమం చేస్తామని దాంట్లో ఎటువంటి సందేహం లేదన్నారు. పొట్టి శ్రీరాములు గారి మీద ప్రేమ ఉందని, అమరావతిలో 58 అడుగుల విగ్రహం పెడతామానడం సంతోషమేనన్నారు, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటుకు మళ్ళీ ఆర్యవైశ్యుల దగ్గర చందాలు వసూలు చేయాలా అని ప్రశ్నించారు? ఎన్టీ రామారావు గారి విగ్రహం సుమారు 200 నుంచి 300 అడుగులు విగ్రహం ఏర్పాటుకు డిపిఆర్ తయారు చేయడానికే 11 కోట్లు ఇచ్చినప్పుడు, ఈ పొట్టి శ్రీరాములు విగ్రహం రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా అని ప్రశ్నించారు?. మీరు చెప్పినా చెప్పకపోయినా మహాత్మా గాంధీ గారి విగ్రహాలు కానీ, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు గాని అందరూ అనేక చోట్ల పెడుతూనే ఉంటారన్నారు. ప్రతి వీధిలో కూడా రెండు విగ్రహాలు ఉంటాయన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఏదో మేము రాజధానిలో స్థలం ఇచ్చామని షో చేయడం సబబు కాదన్నారు, ఆ స్థలానికి కూడా ఎక్కడా జీవో ఇవ్వలేదన్నారు. ఆ స్థలం మీద కూడా ఎక్కడా హక్కులు లేవు, దాంట్లో విగ్రహం పెట్టుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. దానికేమో రోడ్డు మీదకు వెళ్ళిపోయి అంగుళానికి 5000 అని చెప్పి అడుగుకి 5 లక్షలు అని చెప్పి ఆర్యవైశ్యుల దగ్గరే డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. అంటే పొట్టి శ్రీరాములు గారు ఆర్యవైశ్యుల కోసమే కాక తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని చెప్పి ఆయన ప్రాణాల సైతం అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టడం, మేము అక్కడ శ్రీరాములు గారి విగ్రహం పెడుతున్నాము మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి వ్యాపారస్తులందరినీ ఒత్తిడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకించి కండిస్తున్నామన్నారు, ఇప్పటికైనా గాని కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల వ్యాపారాలకు సహకరించాలని డిమాండ్ చేసారు. ఆర్యవైశ్యులంటే చులకన భావం వీళ్ళందరికీ కూడా, ఆ చులకన భావం కొద్ది రోజుల్లోనే పోతుందన్నారు. తప్పకుండా ఆర్యవైశ్యులంతా ఏకమవుతాము ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కూడా మీ అందరి ద్వారా నేను తెలియపరుచుకుంటున్నన్నారు.

ఈ సమావేశంలో సత్తెనపల్లి మునిసిపల్ చైర్మన్ చల్లంచర్ల లక్ష్మి తులసి సాంబశివరావు, 24వ వార్డ్ కౌన్సిలర్ అచ్యుత శివ ప్రసాద్, వైసిపి రాష్ట్ర మునిసిపల్ వింగ్ చైర్మన్ రేపాల శ్రీనివాస్ రావు, ఆర్య వైశ్య ప్రముఖులు కొత్త లక్ష్మయ్య, కొత్తూరు విశ్వేశ్వరరావు, చిల్లం చెర్ల కళ్యాణ్
కుకూట్ల శ్రీనివాస్, కుకూట్ల రాధా కృష్ణ , భవిరిశెట్టి రవి, తాడువాయి ప్రతాప్, దేవతి శివప్రసాద్, పసుమర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments