పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం పాల్యం పంచాయతీలో శుక్రవారం ఒంటరి ఏనుగు దాడులు నిర్వహించి రైతులకు అపార నష్టం కలిగించింది.
సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన ఏనుగు జూపల్లి వద్ద పలువురు రైతులకు చెందిన మామిడి చెట్లు, నీటి పైపులు, డ్రిప్ పైపులను ధ్వంసం చేసింది.
పగలంతా అడవిలో ఉంటూ రాత్రిపూట పంటలను నాశనం చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
#కొత్తూరు మురళి .




