కర్నూలు సిటీ : కర్నూలు :
కార్మికుల శ్రమతో నగరానికి ప్రత్యేక గుర్తింపు• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్• సకాలంలో వేతనాలు, పనిముట్లు, హైజిన్ కిట్లు• ఉచిత జీవిత బీమాలో నమోదు అవసరంపారిశుద్ధ్య కార్మికుల అంకితభావం, నిరంతర శ్రమ వల్లనే నగరానికి ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.
శుక్రవారం కల్లూరు, ముజఫర్‌నగర్, బళ్లారి చౌరస్తా, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్, ముజఫర్‌నగర్ వద్ద కార్మికులతో కాసేపు మాట్లాడారు. పారిశుద్ధ్య పనుల్లో ఎదురవుతున్న సమస్యలు, ప్రజల సహకారం, వేతనాల అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికులు సూచించిన అంశాలను విన్నా కమిషనర్, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.
కార్మికులకు సంబంధించిన వేతనాలు సకాలంలో అందేలా తమ పరిధిలోని ప్రక్రియలను సమయానికి పూర్తి చేస్తున్నామని తెలిపారు. అవసరమైన పనిముట్లు ఇప్పటికే పంపిణీ చేశామని, మిగిలినవాటిని త్వరలో అందజేస్తామని చెప్పారు. ఆయిల్, సోప్ వంటి హైజిన్ కిట్లు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయని, ప్రక్రియ పూర్తైన వెంటనే వాటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ యాక్సిస్ బ్యాంకుతో కలిసి ప్రత్యేక బీమా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కమిషనర్ వివరించారు.
యాక్సిస్ బ్యాంకు ద్వారా వేతనం పొందుతున్న కార్మికుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే రెగ్యులర్ వర్కర్‌కు రూ.1 కోటి, ఆప్కాస్ ఉద్యోగికి రూ.20 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. సాధారణ మరణం సంభవించినా రెగ్యులర్ వర్కర్‌కు రూ.20 లక్షలు, ఆప్కాస్ ఉద్యోగికి రూ.2 లక్షల బీమా లభిస్తుందన్నారు. అదనంగా ఏడాదికి రూ.2,499 చెల్లిస్తే రూ.3 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ప్రమాద బీమా పొందవచ్చని.
అలాగే ఏడాదికి రూ.6,000 చెల్లిస్తే కుటుంబ సభ్యులంతా రూ.3 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చని వివరించారు.ఈ బీమా సౌకర్యాలు పొందేందుకు కార్మికులందరూ యాక్సిస్ బ్యాంకు ద్వారా వేతనాలు పొందే విధంగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్మికుల సంక్షేమానికి నగరపాలక సంస్థ తొలి ప్రాధాన్యత ఇస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి నాగప్రసాద్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్, తదితరులు పాల్గొన్నారు.




