Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshగుంటూరు జిల్లా పెదకాకాని గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు

గుంటూరు జిల్లా పెదకాకాని గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విస్తృత పోలీస్ తనిఖీలు,

📍 గుంటూరు జిల్లాలో గంజాయి సహా అన్ని రకాల మత్తు పదార్థాల నుంచి సమాజాన్ని విముక్తి చేయడమే లక్ష్యంగా, జిల్లా ఎస్పీ గౌరవ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ తెలిపారు.

📍 జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఈ రోజు ఉదయం 05.00 గంటల నుంచి 07.00 గంటల వరకు పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్దిరాల కాలనీలో విస్తృత స్థాయిలో కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ :*

గంజాయి వినియోగం, రవాణా వంటి అక్రమ కార్యకలాపాలపై వచ్చిన సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు నివారణ చర్యలలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు వివరించారు. తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 86 ద్విచక్ర వాహనాలు మరియు 04 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా కాలనీని పూర్తిగా కార్డన్ చేసి, అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాలను సమగ్రంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. గతంలో నేర చరిత్ర కలిగిన వారు, గంజాయి సంబంధిత అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన లేదా పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించి వివరాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

అనంతరం “సంకల్పం” కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి, గంజాయి సహా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు కుటుంబ సంబంధిత దుష్పరిణామాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబాల్లో కలహాలు పెరుగుతాయని, సమాజంలో నేరాలు అధికమవుతాయని డీఎస్పీ స్పష్టం చేశారు.

గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్న డీఎస్పీ శ్రీ మురళీకృష్ణ, గ్రామస్తుల చేత “గంజాయి వద్దు” అనే సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వలు లేదా వినియోగంపై ఏవైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరుతూ, సమాచారం అందించిన వారి గోప్యతను పూర్తిగా కాపాడతామని భరోసా ఇచ్చారు.

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా ఇలాంటి కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని డీఎస్పీ తెలిపారు.

పెదకాకాని సీఐ శ్రీ నారాయణ స్వామి గారు మాట్లాడుతూ :*

పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గంజాయి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గంజాయి అమ్మేవారితో పాటు వినియోగించేవారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నామని తెలిపారు.

గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, పోలీస్ కేసుల కారణంగా ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తూ, ఎవరూ మత్తు పదార్థాల వైపు అడుగులు వేయరాదని సూచించారు.

ఈ కార్యక్రమంలో నార్త్ డీఎస్పీ గారు, పెదకాకాని సీఐ శ్రీ నారాయణ స్వామి గారు, మంగళగిరి టౌన్ సీఐ శ్రీ వీరస్వామి గారు, రూరల్ సీఐ శ్రీ బ్రహ్మం గారు, ఎస్సైలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments