Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshడ్వాక్రా మహిళలు ఎగిరి గంతేసే వార్త.. చంద్రబాబు సంక్రాంతి తీపికబురు..

డ్వాక్రా మహిళలు ఎగిరి గంతేసే వార్త.. చంద్రబాబు సంక్రాంతి తీపికబురు..

DWCRA Women Online Loans: రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పొదుపు సంఘాలు ఆన్‌లైన్‌లోనే రుణాలు పొందే సదుపాయం తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గుంటూరులో జరుగుతున్న సరస్ మేళాను చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించిన చంద్రబాబు.. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగానే ఆన్‌లైన్ ద్వారా రుణాలు పొందేలా సదుపాయం కల్పి్స్తామని చంద్రబాబు వారికి .

Guntur Saras mela : డ్వాక్రా మహిళల కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మహిళా సాధికారతే ధ్యేయంగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు తక్కువ వడ్డీ రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తోంది. స్త్రీ నిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా ఆర్థికంగా భరోసా అందించడంతో పాటుగా.. ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యం కల్పిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలకు శుభవార్త అందించారు. పొదుపు సంఘాలకు ఆన్‌లైన్‌లోనే రుణాలు అందించే సదుపాయం తీసుకువస్తామని ప్రకటించారు. గుంటూరులో జరిగిన సరస్ మేళాకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. పొదుపు సంఘాలు ఆన్‌లైన్‌లో రుణాలు పొందే వెసలుబాటు తెస్తామని అన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొదుపు సంఘాలలో 1.13 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. రూ.26వేల కోట్ల నిధిని, రూ.5,200 కోట్ల కార్పస్‌ ఫండ్‌‌ను ఏర్పాటుచేస్తున్నాయంటూ అభినందించారు. ఆంధ్రప్రదేశ్ మహిళలు.. ఉత్తర భారత మహిళలకు కూడా శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారని కొనియాడారు. మహిళా సాధికారత కోసం స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సదుపాయం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

మరోవైపు సరస్ మేళాలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు. మహిళలతో ముచ్చటించారు. ఉత్పత్తుల తయారీతో పాటుగా వాటి వివరాలు, మార్కెటింగ్ సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పదిరోజుల పాటు ఈ సరస్ మేళా జరగనుంది. గుంటూరు శివారు ప్రాంతమైన నరసరావుపేట రోడ్డులో సరస్ మేళాను నిర్వహిస్తున్నారు.

సరస్ మేళాలలో డ్వాక్రా సంఘాలకు చెందిన స్టాళ్లతో పాటుగా వివిధ స్టాళ్లను సుమారుగా 300 వరకూ ఏర్పాటు చేశారు. సరస్ మేళా జరిగే పది రోజులు.. వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫుడ్ కోర్టులతో పాటుగా చిన్నారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చేనేత వస్తువుల దగ్గర నుంచి గాజు ఉత్పత్తులు, గృహాలంకరణ వస్తువుల వరకూ అనేక ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments