దస్తూరాబాద్ మండలంలోని ప్రభుత్వ పాటశాలలో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఆయా పాఠశాల హెచ్ఎంల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం భోగి మంటలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




