అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, దిగువ చింత వారి పల్లెలో శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు యామల సుదర్శనం, రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.
భారతీయులందరూ అంబేద్కర్ ను గుర్తుంచుకోవాలని, మనకోసం ఆయన రాజ్యాంగాన్ని రూపొందించారని ముఖ్య వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘం సభ్యులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




