హైదరాబాద్ : పోలీసులు చైనా మాంజాపై ప్రజలకు ఎంత అవగాహన కలిగించినా ఇదే తరహా ఘటనలు జరగడం పునరావృతం కావడం విచారణ కరం.
అంబర్‌పేట కొత్త ఫ్లైఓవర్ మీద తన ద్విచక్ర వాహనంపై గోల్నాక నుండి రామంతపూర్ వైపు వెళ్తుండగా, ఒక వ్యక్తి మెడకు బలంగా తగిలిన చైనా మాంజా.
దీంతో అతని గొంతు కోసుకుపోయి తీవ్ర రక్తస్రావం అవ్వడంతో, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు.
మనుషుల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను వాడడం ఇకనైనా ఆపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు.
ఈ మాంజాను ఎవరైనా విక్రయిస్తున్నట్టు మీ దృష్టికి వస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.
#sidhumaroju




