Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshబాపట్ల హెడ్ కానిస్టేబుల్ CH. నాగరాజు జాతీయ క్రీడలలో మూడు పతకాలు |

బాపట్ల హెడ్ కానిస్టేబుల్ CH. నాగరాజు జాతీయ క్రీడలలో మూడు పతకాలు |

క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో మూడు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు
బాపట్ల: క్రీడలలో సత్తా చాటిన బాపట్ల జిల్లా హెడ్ కానిస్టేబుల్. జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో మూడు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు

షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పసిడి పతకాలు, జావలిన్ త్రోలో రజత పతకం
2026 ఏప్రిల్ నెలలో థాయిలాండ్‌లో జరగనున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌కు ఎంపికహెడ్ కానిస్టేబుల్ సిహెచ్. నాగరాజును అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
జాతీయ స్థాయిలో సత్తా చాటి, అంతర్జాతీయ స్థాయిలో జరిగే
క్రీడా పోటీలకు ఎంపిక కావడం అభినందనీయం
అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో కూడా సత్తా చాటాలి

బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింప చేయాలి

జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు

జాతీయ స్థాయిలో జరిగిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో మూడు పతకాలు సాధించి, అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలకు ఎంపికైన బాపట్ల జిల్లా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్. నాగరాజును జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు. హెడ్ కానిస్టేబుల్ నాగరాజు శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి క్రీడలలో గెలుపొందిన పతకాలు, సర్టిఫికెట్లను చూపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అతడిని పతకాలతో సత్కరించి, ప్రశంసా పత్రాన్ని అందజేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ బాపట్ల జిల్లా పోలీస్ శాఖలో స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 6, 7 తేదీలలో ఎయిమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ – 2026 క్రీడా పోటీలలో అథ్లెటిక్స్ విభాగంలో 40 ప్లస్ కేటగిరీలో పోటీపడి, షాట్‌పుట్, డిస్కస్ త్రో లలో పసిడి పతకాలు, జావలిన్ త్రో లో రజత పతకం సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరచడం ఎంతో అభినందనీయమన్నారు.

జాతీయ స్థాయిలో జరిగిన ఈ క్రీడా పోటీలలో తన సత్తా చాటి, రానున్న 2026 ఏప్రిల్ నెలలో థాయిలాండ్ దేశంలో జరగనున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడలకు అర్హత సాధించడం బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. విధి నిర్వహణతో పాటు క్రీడలలో కూడా నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువస్తుండడం ఇతర పోలీస్ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది క్రీడలలో పాల్గొంటూ ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. రానున్న 2026 ఏప్రిల్ నెలలో థాయిలాండ్‌లో జరగనున్న వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో కూడా సత్తా చాటి, దేశానికి, రాష్ట్రానికి, జిల్లా పోలీస్ శాఖకు మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎస్.బి ఇన్స్పెక్టర్ జి.నారాయణ, హెడ్ కానిస్టేబుల్ సిహెచ్.నాగరాజు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments