మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఆరు నెలల కాలంలో రూ.2 కోట్ల 8 లక్షల విలువైన 1,039 కోల్పోయిన , దొంగిలించిన మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడంతో వాటి దొంగతనాలు, కోల్పోవడం అధికమవుతున్నాయి.
కోల్పోయిన లేదా దొంగిలించిన మొబైల్ ఫోన్లు వివిధ మార్గాల్లో ఇతరుల చేతికి వెళ్లి అక్రమ కార్యకలాపాలు, సైబర్ నేరాలకు ఉపయోగించబడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (CEIR) పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను గుర్తించి రికవర్ చేయడం జరుగుతోంది అని అన్నారు.
అవినాష్ మోహంతి, ఐపీఎస్ మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఎల్.బీ.నగర్ , సిసిఎస్ మల్కాజ్‌గిరి కేంద్రాల్లో ఐటీ సెల్ సహకారంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.ఈ ప్రత్యేక బృందాలు (సిఈఐఆర్) పోర్టల్‌ను వినియోగించి ఆరు నెలల వ్యవధిలో మొత్తం 1,039 మొబైల్ ఫోన్లను రికవర్ చేశాయి.
రికవరీ చేయబడిన మొబైల్ ఫోన్లో వివరాలు వివరాలు ఇలా ఉన్నాయి, సిసిఎస్ ఎల్.బీ.నగర్ 739 మొబైల్ ఫోన్లు
సిసిఎస్ మల్కాజ్‌గిరి 300 మొబైల్ ఫోన్లు
మొత్తం 1,039 మొబైల్ ఫోన్లు.
ఈ ఏడాది ఇప్పటివరకు (ఈ రికవరీతో కలిపి) మొత్తం 4,733 మొబైల్ ఫోన్లను మల్కాజ్‌గిరి పోలీసులు రికవర్ చేసినట్లు తెలిపారు. గురువారం రికవర్ చేసిన మొబైల్ ఫోన్లను వాటి యథార్థ యజమానులకు మల్కాజ్‌గిరి పోలీసులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ బాధితులతో మాట్లాడి, పోలీసుల పనితీరుపై అభిప్రాయాలను సేకరించారు. అలాగే మొబైల్ ఫోన్లలోని విలువైన వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు.
తమ కోల్పోయిన మొబైల్ ఫోన్లు తిరిగి పొందిన యజమానులు మల్కాజ్‌గిరి పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి సేవలను ప్రశంసించారు.
కార్యక్రమంలో కె. గుణశేఖర్, ఐపీఎస్ , డీసీపీ (క్రైమ్స్), సి.హెచ్. రమేశ్వర్, అడిషనల్ డీసీపీ (క్రైమ్స్), కరుణా సాగర్ , ఏసీపీ (క్రైమ్స్) పర్యవేక్షణలో సిసిఎస్, ఐటీ సెల్, అధికారులు ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, హెచ్‌సీ, పీసీ స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
#sidhumaroju




