మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో కీలకం అయినటువంటి ప్రత్యేక రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య కు సంబంధించిన నమోదును భూమి ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా వివరాలను వ్యవసాయ శాఖకు అందించాలని ఈ క్రమంలో తమ పట్టాదారు పాస్ పుస్తకం,ఆధార్ కార్డు.
ఆధార్ కార్డుకు జత చేసినటువంటి మొబైల్ ఫోన్ నెంబరు అందజేయాల్సి ఉంటుందని తెలియజేశారు.వివరాలను వ్యవసాయ విస్తరనాధికారులకు అందించినట్లయితే 11 అంకెలతో కూడినటువంటి రైతు విశిష్ట సంఖ్య అందజేయబడుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలైనటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఫసల్ బీమా యోజన,రాష్ట్రీయ కిసాన్ వికాస్ యోజన వంటి పథకాల అమలులో తప్పనిసరి అని వారు తెలిపారు.




