Sunday, January 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshవాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల !!

వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోట్ల !!

కర్నూలు
నంద్యాల జిల్లా డోన్ మండలంలోని ఓబుళాపురం గ్రామంలో ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు హాజరై వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రధాన లక్ష్యమని, ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఓబుళాపురం గ్రామస్తుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా చేపడతామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments