Home South Zone Andhra Pradesh విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్య జ్యోతి |

విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్య జ్యోతి |

0

విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్యాజ్యోతి
విద్యాజ్యోతి ద్వారా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
మంత్రి నారా లోకేష్ సంస్కరణలతో విద్యార్థుల జీవితాల్లో వెలుగు
మంత్రి నారా లోకేష్ విజన్‌తో రాష్ట్ర విద్యకు పునర్జీవనం
మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్

విద్యే వెలుగుగా భావించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన విద్యాజ్యోతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో వెనుకబడుతున్న విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి అందిస్తూ, విద్యారంగంలో సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిలుస్తుందని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ అన్నారు.

శుక్రవారం మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా జ్యోతి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో ప్రవేశపెట్టిన నూతన సంస్కరణల వల్ల రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని జవ్వాది కిరణ్ చంద్ అన్నారు. ఈ సంస్కరణల ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా పాఠ్యపద్ధతులు రూపొందించబడుతున్నాయని.

దాని ఫలితంగా వారి భవిష్యత్తు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందని తెలిపారు.విద్యే సమాజాభివృద్ధికి పునాది అని పేర్కొన్న ఆయన, పుస్తకాలు విద్యార్థుల జీవిత దిశను మలిచే శక్తివంతమైన సాధనాలుగా మారుతాయని అన్నారు. విద్యాజ్యోతి వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, మాదల రమేష్ బాబు, కనపాల సాగర్, కఠారి మురళి, కొడవలి ఆనంద్,జాలాది సందీప్, పిడుగు రవి, కాకర్లముడి సారంగపాణి, గుడిమెట్ల ఎల్లయ్య, కటారి సాంబయ్య,పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version