వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
బాపట్ల: ఐవిఎస్ సర్వేలో 13 మంది వీఆర్‌వోలు కేవలం 50 శాతం పనితీరు చూపటంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రజలకు రెవెన్యూ సేవలు సమయానికి నిర్లక్ష్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలని వీఆర్‌వోలకు ఆదేశించారు. 13 మంది వీఆర్‌వోలతో సమావేశం నిర్వహించి, పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో డిఆర్వో గంగధర్ గౌడ్ కూడా పాల్గొన్నారు.
#Narendra




