బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు
బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంక సముద్ర ప్రాంతంలో అభివృద్ధి పనుల పురోగతిని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పరిశీలించారు. ఈ సందర్భంగా సూర్యలంక బీచ్ ని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్ల నిధులతో పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న పనులపై ఆయన ఆరా తీశారు. అభివృద్ధి పనులకు సంబంధించి నిర్మాణాలకు కేటాయించిన స్థలమును మ్యాప్ ద్వారా ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనులు వేగంగా ఒకదాని వెంట ఒకటి జరగాలని ఆయన కాంట్రాక్టర్లకు సూచించారు.
పనులను నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. సూర్యలంక బీచ్ లో చేపట్టిన పనులన్నీ సెప్టెంబర్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని, పనుల పురోగతికి సంబంధించి వారం వారం నివేదికను అందజేయాలని ఆయన పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల తహసిల్దార్ సలీమా, బాపట్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, మండల ఎంపీడీవో, సర్వేయర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
#Narendra
