Home South Zone Andhra Pradesh కిడ్నీ సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంకుల ప్రారంభం |

కిడ్నీ సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంకుల ప్రారంభం |

0

మ‌రో ప‌దిహేను రోజుల్లో నిర్మాణం పూర్తి అయిన వాట‌ర్ ట్యాంకుల ప్రారంభోత్స‌వం*
కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు..*
55 ట్యాంకుల ద్వారా 38 గ్రామాల్లోని 12148 నివాస గృహాలకు ఇంటింటికి శుద్ధ జలాల సరఫరా..*
త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సన్నాహాలు..*
ఎ.కొండూరు మండ‌లంలో ఆర్.డ‌బ్ల్యూ.ఎస్ వాట‌ర్ ట్యాంక్ ల ప‌రిశీల‌న లో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి..*
ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులతో కలిసి పర్యటించిన ఎంపీ..*

తిరువూరు:విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ శనివారం తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు మండలం కోడూరు, పెద్ద తండా గ్రామాల్లో పర్యటించారు. ఆర్.డబ్ల్యు.ఎస్ (గ్రామీణ నీటి సరఫరా) ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసిన వాటర్ ట్యాంకులను ఆయన పరిశీలించారు. ట్రయల్ రన్ సన్నాహాల్లో భాగంగా ట్యాంకులను సందర్శించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన వాటర్ ట్యాంకులను 15 రోజుల్లో ప్రారంభోత్సవం చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణమైన కలుషిత నీటికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు.
వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ నుంచి శుద్ధి చేసిన నీటిని కుదప వరకు, అక్కడి నుంచి విస్సన్నపేట, గంపలగూడెం, ఏ కొండూరు మండలాల్లోని మొత్తం 38 గ్రామాలకు 55 వాటర్ ట్యాంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఈ పథకం ద్వారా 12,148 నివాస గృహాలకు ఇంటింటికి శుద్ధ జలాలు అందించనున్నామని ఎంపీ తెలిపారు.

శుద్ధ జలాల సరఫరా ప్రారంభాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నిర్వహించాలని భావిస్తున్నట్లు ఎంపీ పేర్కొన్నారు. అనంతరం ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులతో ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించి, నీటి సరఫరా, నిర్వహణ, భవిష్యత్ అవసరాలపై పలు సూచనలు చేశారు. ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఈకార్య‌క్ర‌మంలో కొడూరు గ్రామ పార్టీ అధ్య‌క్షుడు గిరి , జిల్లా తెలుగు రైతు అధ్య‌క్షుడు చెరుకూరి రాజేశ్వ‌ర‌రావు, జ‌న‌సేన తిరువూరు నియోజ‌క‌వర్గ స‌మ‌న్వ‌య క‌ర్త మ‌నుబోలు శ్రీనివాస‌రావు గ్రామ పార్టీ మాజీ అధ్య‌క్షుడు ఎలినేని చంద్ర‌శేఖ‌ర‌రావు, సోసైటీ అధ్య‌క్షుడు ఎలినేని కృష్ణారావు, యూనిట్ ఇన్చార్జ్ స‌గుర్తి శ్రీనివాస‌రావు, ఎస్టీ సెల్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భాణావ‌త్తు భీమానాయ‌క్, పెద్ద తండా గ్రామ పార్టీ అధ్య‌క్షుడు జ‌ర‌బ‌ల గోప‌రాజు, ఎకొండూరు మండ‌ల పార్టీ అధ్య‌క్షుడు భ‌రోతు ప్లీకా నాయ‌క్, గంప‌ల గూడెం మండ‌లం మాజీ ప్రెసిడెంట్ వీరా రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఎ.రమేష్ రెడ్డి, ఎ.కొండూరు మండ‌ల తెలుగుదేశం పార్టీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి జి.రాంప్ర‌సాద్ రెడ్డి, యువ‌నాయ‌కుడు న‌గేష్ ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.

NO COMMENTS

Exit mobile version